రూపాణీ తొలగింపు అందుకే
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని తొలగించడానికి కారణం ఏంటీ అంటే.. ? మృదుభాషి అయిన రూపాణీపై ‘బలహీన సీఎం’ అన్న ముద్ర పడింది. కరోనాను సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్ లో ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌నకు ఎలాంటి సీట్లు రానప్పటికీ 13.28% ఓట్లు సంపాదించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండడంతో భాజపాకు ప్రత్యామ్నాయం ప్రచారం చేసుకుంటూ పటేళ్లకు కీలకమైన పార్టీ పదవులు అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో రూపాణీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు తక్కువని భాజపా నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలినట్టు సమాచారం. అందుకే ఆయన్ని పక్కకు పెట్టింది. పటేల్ వర్గానికి చెందిన నేతకు సీఎం బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది.