రోజుకు 3 లక్షల టీకాలు
భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యంపై ఆ శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
టీకా సెంటర్లుగా విద్యా సంస్థలు, రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు కనిపించగానే అప్రమత్తమైన వారు త్వరగా కోలుకున్నారని.. నిర్లక్ష్యం చేసిన వారే ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయన్నారు.రాష్ట్రంలో రోజుకు 3 లక్షల కొవిడ్ టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.