బాలీవుడ్ పై సామ్ మోజు
కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం భర్త నాగచైతన్యతో గొడవలే కారణం. ఈ జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయిందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు సామ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారమ్. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకుందట. ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో సమంతకు మంచి పేరొచ్చింది. దాంతో.. బాలీవుడ్ నుంచి అవకాశాలు మొదలయ్యాయయిని టాక్.
నిజానికి సమంతకు బాలీవుడ్ వెళ్లాలన్న ఆసక్తి, ఆత్రుత ఏమాత్రం ఉండేవి కావు. కానీ బిజినెస్ మేన్ 2తో బాలీవుడ్ కిక్కేమిటో అర్థమైంది. అందుకే కొన్నాళ్ల పాటు అక్కడ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని, అక్కడ తనకంటూ ఓ పీఆర్నీ, మేనేజర్ని నియమించుకుందని తెలుస్తోంది. సినిమాలకు కొద్దిరోజుల పాటు బ్రేక్ ప్రకటించిన సామ్.. అది పూర్తికాగానే బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందట.