ట్రైలర్ టాక్ : లవ్ స్టోరీ
ప్రేమకథల స్పెషల్ లిస్ట్.. శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథగా ‘లవ్ స్టోరీ’ రాబోతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి-నాగ చైతన్య జంటగా నటించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈనెల 24న లవ్ స్టోరీ విడుదల కాబోతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్లో శేఖర్ కమ్ముల తన మార్క్‌ని అడుగుడుగునా చూపించాడు.
శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే లవ్ లీ మూమెంట్స్, ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయన్న సంగతి ట్రైలర్ తో అర్థమతుంది.డాన్స్ తప్ప మరో ప్రపంచం తెలియని హీరో, ఆ డాన్స్ తో ఎలా ఎదగాలనుకుంటాడు? బీటెక్ చదివి సాఫ్ట్ వేర్‌జాబ్ చేయాలనుకున్న హీరోయిన్ – ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? అసలు వీళ్లిద్దరూ ఎలా కలిశారు? వీళ్ల ప్రేమకథకు అడ్డేంటి ? ఇదే లవ్ స్టోరీ కథ. ఈ పూర్తి కథని ట్రైలర్ లోనే అర్థం అయ్యేలా చెప్పేశారు. శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషన్ కోసం చూడాలన్న ఆసక్తిని ట్రైలర్ ద్వారా కలిగించారు.