కోహ్లీ స్థానంలో రోహిత్ కి కెప్టెన్ పగ్గాలు.. బీసీసీ స్పష్టత !

టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెటర్ అనే ప్రచారం చాన్నాళ్ల నుంచి ఉంది. ఐపీఎల్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు టైటిల్ గెలిచింది. కానీ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ కి అప్పగించాలనే డిమాండ్ చాన్నాళ్ల నుంచే ఉంది. ఇప్పుడు బీసీసీఐ అదే నిర్ణయానికి వచ్చేసింది. టీ20 కెప్టెన్ బాధ్యతలని రోహిత్ కి అప్పగించనుంది. రోహిత్ కెప్టెన్ గా టీమిండియా టీ20 వరల్డ్ ఆడబోతుందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పుపై బీసీసీఐ స్పందించింది.

ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. ఇదంతా రబ్బిష్ అంటూ ఆయన కొట్టిపారేశారు. మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఏదీ జరగబోదని అన్నారు. స్ప్లిట్ కెప్టెన్సీ (టెస్టులకు ఒక కెప్టెన్, లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కు మరొక కెప్టెన్) అంశం గురించి బీసీసీఐ సమావేశం కావడం కానీ… చర్చించడం కానీ జరగలేదని చెప్పారు. అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని తెలిపారు.