కేసీఆర్ దగ్గరకు భట్టీ
దళిత బంధు పథకం ఇతర పార్టీలలోని దళిత నేతలని టీఆర్ఎస్ వైపు ఆకర్షిస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే దళిత బంధు పథకానికి బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పడిపోయారు. పార్టీ ఆదేశాలని కాదని దళిత బంధుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అంతేకాదు.. ఇవాళో.. రేపో ఆయన అధికారికంగా కారెక్కిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిస్థితి కూడా అలానే ఉంది. మొదటి సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మరోసారి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తాజాగా నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు. అందులో భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. దీంతో వెళ్లాలా వద్దా .. అని తర్జన భర్జన పడిన భట్టి విక్రమార్క చివరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న భట్టీ.. కేసీఆర్ కు దగ్గర అవుతున్నారు. ఆయన కూడా కారెక్కె అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.