బిగ్ బాస్ షోకి ‘యు’ సర్టిఫికెట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ -1ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ డీల్ చేశారు. ప్రతి ఇంట్లోకి ఈ షోని తీసుకెళ్లారు. ఫ్యామిలీ ప్రేక్షకులని దగ్గర చేశాడు. బిగ్ బాస్ కు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెంచేశాడు. అయితే ఆ తర్వాత సీజన్స్ 2,3,4 అంతా మజాగా సాగలేదు. బోల్డ్ కంటెంట్, గ్లామర్ డోస్ ఎక్కువైంది. ఇది ఫ్యామిలీ ప్రేక్షకులకి నచ్చలేదన్నది సత్యం. అయితే సీజన్-5ని మాత్రం ఫ్యామిలీ ప్రేక్షకులని నచ్చేలా షోని ముందుకు తీసుకెళ్తున్నట్టు అర్థం అవుతుంది.
7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బోల్డ్ కంటెంట్ తో ఊరించి, ఉడికించే సరయూని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనే నెటిజన్స్ బిగ్ బాస్ ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అలర్టయిన బిగ్ బాస్ సరయూని మొదటి వారానికే బయటికి పంపించేశారు. ఓటింగ్ విషయంలో బిగ్ బాస్ ప్రమేయం ఏమీ ఉండదని అందరికీ తెలుసు. కానీ కావాలనుకుంటే.. కొన్ని ప్రత్యేక వెసులుబాటులని ఉపయోగించి.. సరయూని సేవ్ చేసే అధికారం మాత్రం బిగ్ బాస్ కు ఉంది. దాన్ని సరయూ విషయంలో బిగ్ బాస్ వినియోగించలేదు. ఫైనల్ గా బిగ్ బాస్ షోకి యు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సరయూ లాంటి ఏ సర్టిఫికెట్ ని బయటికి పంపించారనే చర్చ సాగుతుంది.