ఈటెల-హరీష్.. భయంకర నిజాలు !
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటెల-హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం మొదలయింది. అది పలు సంచలనాలకు దారితీస్తోంది. ఈటెల ఏకంగా సీఎం కావాలనుకున్నాడని హరీష్ ఆరోపించారు. ఆ ఆరోపణలపై ఈటెల గట్టిగానే తిప్పికొట్టారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివాడని అన్నాడు. చూస్తుంటే ఈటెల హరీష్ విషయంలో ఇంకాస్త ముందుకుపోయేటట్టు కనిపిస్తున్నాడు. మామ కేసీఆర్, బామ్మర్ధి కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు హరీష్ పన్నాగం ఒకటి ఉందని ముందు ముందు ఆరోపణలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుపై పెట్టినట్టు కనబడుతుంది. గులాబి పార్టీలో గెలిస్తే కేటీఆర్ ఖాతాలో.. ఓడితే హరీష్ ఖాతాలో అనే ఒక పద్దతి కొనసాగుతుంది. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదన్నది అందరికీ తెలుసు. అందుకే ఈ ఉప ఎన్నిక బాధ్యతలని కేసీఆర్ కేటీఆర్ కి ఇవ్వకుండా హరీష్ కి ఇచ్చారనే టాక్ టీఆర్ ఎస్ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఈ విషయం పక్కనపెడితే.. ఈటెలపై గెలుపు కోసం హరీష్ గట్టిగానే.. తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ క్రమంలో ఈటల, హరీష్ లకు సంబంధించిన భయంకర నిజాలు ఒకరినొకరు బయటపెట్టుకునేలా కనిపిస్తున్నారు.