కాజల్ గర్భవతి.. అందుకే విశ్రాంతి ?

చందమామ కాజల్ పెళ్లయి యేడాది పూర్తికావొస్తోంది.  ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది కాజల్. గతేడాది అక్టోబర్ లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది కాజల్. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అలా ఏడాదిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ గర్భవతి అయిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. 

ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చేలా కాజల్ సైలెంట్ అయిపోయింది. గడిచిన 2 వారాలుగా ఆమె సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్, ఓ కొత్త ఫొటోతో సోషల్ మీడియాలో కనిపించే ఈ బ్యూటీ.. 2 వారాలుగా సైలెంట్ అవ్వడంతో, ఆమె గర్భవతి అనే పుకార్లు మరింత  ఊపందుకున్నాయి. త్వరలో కాజల్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.