దానం బాట‌లో ముఖేశ్..!!

కాంగ్రెస్ పార్టీకి దానం నాగేంద‌ర్ రాజీనామా చేసిన నేప‌థ్యంలో మ‌రో నేత ముఖేష్ కూడా అదే బాట‌లో వెళుతున్నారు. ముఖేష్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో ఇప్ప‌టికే స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖేష్ వారితో చ‌ర్చించిన అనంత‌రం నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో త‌మ‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే భావ‌న‌తోనే ముఖేష్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.