రవిశాస్త్రీపై చర్యలు.. క్లారిటీ ఇచ్చిన గంగూలీ !

కరోనా ఆందోళనల నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రి ఓవల్‌లోని హోటల్లో బసచేస్తుండగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, పుస్తకావిష్కరణకు సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి పొందలేదని.. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలనే కామెంట్స్ వినిపించాయి.

దీనిపై బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ అన్నాడు. ఎవరైనా ఎంతసేపని హోటల్‌ గదిలో ఉంటారు? మీరు ఒక రోజు మొత్తం ఇంట్లో, మరోరోజు మొత్తం బయట ఉండగలరా?ఎవరైనా హోటల్‌ గదిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆపలేం. వాక్సినేషన్‌ తీసుకున్నా చాలా మంది వైరస్‌బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇలా ఉంది అని గంగూలీ చెప్పుకొచ్చారు.