సినిమా టికెట్ల వ్యవహారం.. షాకింగ్ నిజాలు !

ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. కానీ ఎవ్వరూ బయటపడటం లేదు. బయటికొచ్చి ఓ మాట కూడా అనడం లేదు. ఇంతలో ఏపీ మంత్రి షేర్ని నాని షాకింగ్ నిజాలు చెప్పారు. ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారు. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించింది అన్నారు. దీంతో.. సినీ పెద్దలు భుజాలు తడుముకొనే పరిస్థితి వచ్చింది.

ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను అమ్మవచ్చని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపిందని మంత్రి షేర్న్ నాని అన్నారు. పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించింది. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం చేసేందుకు.. టిక్కెట్ రేట్లను ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చామన్నారు. ఇక త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగన్ ని కలుస్తారని మంత్రి తెలిపారు.