సరయూ వారం రేటెంతో తెలుసా ?

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ జరిగింది. ముసుగులు తొలిగిపోయేలా కామెంట్స్ చేసుకున్నారు. ఎటాక్ చేసుకున్నారు. ఫైనల్ గా రెండో వారం ఎలిమినేషన్ లోకి ఏడుగురు వచ్చారు. ఉమా, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, యానీ, ప్రియ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో వందరోజులు ఉంటా. అందరినీ ధమ్ ధమ్ చేస్తానన్న యూట్యూబర్ సరయూ.. తొలి వారానికే ఇంటి బాట పట్టింది. వెళుతూ వెళుతూ.. హోస్ట్ నాగ్ సమక్షంలో ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బయటికొచ్చాక ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలోనూ అదే రేంజ్ లో ఆరోపణలు చేసింది సరయూ. అదే సమయంలో తొలిరోజు సరయూ బిగ్ బాస్ ఎంత ఇచ్చాడు ? అనే చర్చ జరుగుతుంది. రూ. 70 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ముట్టజెప్పాడని సమాచారం. అంటే సరయూ వారం రేటు దాదాపు రూ. లక్ష అన్నమాట.