జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. అంతా సేఫ్ గేమ్ ?
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పిండుకుంటోంది. పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్నంటాయ్. లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో రూ. 100 దాటేసింది. ఇంకా ముందుకుపోతూనే ఉంది. పెట్రో ధరల పెరుగుదలతో నిత్యవసర ధరలు పైపైకి పోతున్నయి. సామాన్యుడి నడ్డీ ఇరుస్తున్నయి. అందుకే పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వాలకూ పెట్రో సెగ తగులుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సేఫ్ గేమ్ కి తెరలేపినట్టు కనబడుతుంది.
ఈ నెల 17వ తేదీన జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వ్యూహాత్మకంగా ప్రచారం ప్రారంభించారు. అక్కడ నిర్ణయం తీసుకుంటామని లీకులు ఇస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్, డీజిల్పై దాదాపు 80శాతం పైనే పన్నులు విధిస్తున్నాయి. దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వాలు ఆదాయం కోల్పోతాయి.
అందుకే మెజార్టీ రాష్ట్రాలు తాము కోల్పోయే ఆదాయానికి నష్టపపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. కానీ కేంద్రం ఇవ్వదు. కేంద్రం తాము జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని తేవాలనుకున్నా రాష్ట్రాలే అడ్డుకున్నాయని ప్రచారం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. కానీ ఒక్క రూపాయి పన్ను తగ్గిస్తేనే రూ. 15వేల కోట్లు నష్టపోతామంటూ గతంలో మంత్రులే సాధ్యం కాదని తేల్చారు. అయితే మభ్య పెట్టాలి కాబట్టి అప్పుడప్పుడు పెట్రోల్, డిజిల్ ధరలను జీఎస్టీలోకి చేర్చే కసరత్తు జరుగుతోందని ప్రకటనలు చేస్తూ ఉంటారు.ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ సేఫ్ గేమ అన్నమాట.