కంగ‌నాకు అరెస్ట్ వార్నింగ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ త‌న నోటి తీట‌తో కోర్టు కేసుల‌ను కూడా ఎదుర్కొంటూ ఉంది. ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ ముంబై కోర్టులో కంగ‌నాపై ఒక పిటిష‌న్ దాఖ‌లు చేసి కొంత‌కాల‌మైంది. ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె అకార‌ణంగా త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై జావేద్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అది విచార‌ణ అయితే జ‌రుగుతోంది కానీ, కంగ‌నా మాత్రం కోర్టుకు హాజ‌రు కావ‌డం లేదు. ఇప్ప‌టికే కోర్టు నోటీసులు జారీ చేసినా.. కంగ‌నా మాత్రం హాజ‌రు కాలేదు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనాని అరెస్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

జావేద్ అక్త‌ర్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం మ‌రోసారి విచార‌ణ‌కు వచ్చింది. ఈసారి కూడా కంగనా కోర్టుకు రాకపోవడంపై ఆమె న్యాయ‌వాది స్పందిస్తూ.. ఆమెకు క‌రోనా సింప్ట‌మ్స్ ఉన్నాయంటూ కోర్టుకు విన్న‌వించాడు. త‌లైవి సినిమా ప్ర‌మోష‌న్ కోసం కంగ‌నా చాలా చోట్ల‌కు తిరిగింద‌ని, ఈ నేప‌థ్యంలో ఆమెకు క‌రోనా సింప్ట‌మ్స్ క‌నిపిస్తున్నాయ‌ని, అందుకే ఆమె కోర్టుకు హాజ‌రుకావ‌డం లేద‌ని తెలిపాడు. మ‌రో ఏడురోజుల గ‌డువును కోరాడు. అయితే కంగ‌నా తీరుపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నెల 20వ తేదీన త‌దుప‌రి విచార‌ణ జ‌రుగుతుంద‌ని, ఆ రోజున కంగ‌నా కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని, లేక‌పోతే అరెస్టు ఆదేశాల‌ను ఇస్తామని కోర్టు హెచ్చరించింది.