బిగ్ బాస్ 5 : హాట్ భామల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎప్పుడంటే ?

బిగ్ బాస్ తెలుగు సీజన్5 విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంతా అంటున్నారు. సోషల్‌ మీడియాలో సైతం ఆమెనే ఎలిమినేట్‌ అవుతుందని పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ సీజన్ ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయింది. కానీ ఉన్నది అంతా చెత్తే. ఈ నేపథ్యంలో ఈ చెత్తంతా క్లియర్ చేసే పనిలో బిగ్ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. అవసరమైతే ప్రతివారం డబుల్ ఎలిమినేషన్ తో బయటికి పంపించే ఛాన్స్ కూడా ఉందట. ఆ తర్వాత ఇద్దరు హాట్ బ్యూటీలని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపించే అవకాశం ఉందని సమాచారమ్.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో హాట్ యాంకర్ వర్షిణి, నటి నవ్య పేర్లు బలంగా వినిపించాయి. ఈ వార్తలు రాగానే వీరిద్దరు బయట కనిపించలేదు. దీంతో వీరి బిగ్ బాస్ ఎంట్రీ ఖాయం అనుకున్నారు. కానీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్స్ లో వీరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో వీరికోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేశారని  చెబుతున్నారు. మూడు లేదా నాలుగు వారాల తర్వాత ఒకరిని.. ఆ తర్వాత ఒకట్రెండు వారాల గ్యాప్ తర్వాత మరొకరిని హౌస్ లోకి పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అందంలో ఆకట్టుకొనే, ఇంకా చెప్పాలంటే కట్టిపెడేసి మొహం ఒక్కటి లేదు. అందుకే వర్షిని తీసుకొచ్చి.. ఆమెతో ఆ పని చేయబోతున్నారట. మరీ.. ఆ పాతకు వర్షిణి ఏమేరకు న్యాయం చేస్తుందన్నది చూడాలి.