పాక్ తో తలపడే టీమిండియా జట్టు.. ఇదే !

టీ20 వరల్డ్ కప్ కి సమయం దగ్గరపడుతోంది. యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో అందరి చూపు భారత్-పాక్ మ్యాచ్ మీదనే. అక్టోబర్ 24న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా దాయాదుల మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగే భారతజట్టు ఏంటీ ? అన్న చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్‌తో తలపడబోయే టీమిండియా జట్టు ఎంపిక గురించి స్పందించారు. పాక్ మ్యాచ్ కోసం తన జట్టుని ప్రకటించాడు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా ఉండాలని గంభీర్ సూచించాడు. విరాట్‌ కోహ్లీ వన్‌డౌన్‌లో, సూర్యకుమార్‌ యాదవ్ నాలుగో స్థానంలో, ఆ తర్వాత రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, వరుణ్‌ చక్రవర్తి, షమీ, బుమ్రా వరుసగా ఆడాలని చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్ లో పాక్ పై భారత్ దే పూర్తి ఆధిపత్యం. ఇప్పటి వరకు వరల్డ్ కప్ పాక్ చేతితో భారత్ కి ఓటమి అనేదే లేదు. ఇకపై కూడా ఈ రికార్డుని కంటిన్యూ చేయాలని టీమిండియా ఆశపడుతుంది. వరల్డ్ కప్ లో ఒక్కసారైనా భారత్ ని ఓడించాలనే కసితో పాక్ బరిలోకి దిగుతుంది. మరీ.. ఈసారైన పాక్ ఆశలు నెరవేరుతాయో చూడాలి.