స్టార్ హీరో కొడుకు.. ఆ అలవాటు పోలె !

గొప్ప వంశం. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వంశీకి చెందిన వారసుడు. అతి త్వరలో తెరంగేట్రం చేస్తాడు. ప్రేక్షకులని అలరిస్తాడని అనుకున్నారు. ఆ స్టార్ హీరో కూడా అదే అనుకున్నాడు. తన మాదిరిగానే తన కొడుకు తొడగొడతాడు. అది చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తారని అనుకున్నాడు. మూడ్నాలుగు ఏళ్ల కిందటే హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు ట్రై చేశాడు. కానీ కుదర్లే.  ఈ లోగా ఫిజిక్ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది. అతడికి సినిమాల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదేమో అన్న పుకార్లు మొదలయ్యాయి.

అలాంటిదేమీ లేదు. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టు స్టార్ హీరో కొన్ని సార్లు కవర్ చేశారు. కట్ చేస్తే.. ఇటీవల ఓ హీరో బర్త్ డే పార్టీకి ‘ఆ కురాడు’ హాజరయ్యాడు. చూసిన వాళ్లు తగ్గడం మాట దేవుడెరుగు, మళ్లీ మామాలు షేప్ లోకే వచ్చేసాడని గమనించారు. అంతే కాదు, గతంలో వున్న ‘అలవాటు’ మానేసాడని టాక్ వుంది. అదీ నిజం కాదని తేలిపోయింది. పార్టీలో చేతిలో ‘గ్లాస్’ తో కనిపించడంతో. ఈ విషయం ఆ చెవిన.. ఈ చెవిన పడి.. అభిమానుల దాక చేరింది. దీంతో.. అభిమానులు నిరాశ చెందుతున్నారు.