కాజల్ ప్రెగ్నెన్సీ.. సీనియర్ హీరోకి ఇబ్బందే !

స్టార్ హీరోయిన్ కాజల్ ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజం లేదని చందమామ ఇప్పటి వరకు ఖండించను లేదు. పైగా కనిపించకుండా పోయింది. సోషల్ మీడియాలో ఉలుకు.. పలుకు లేదు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు నిజమే. రెస్ట్ తీసుకుంటూ ఉన్నట్టుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. నిజంగానే కాజల్ ప్రెగ్నెంట్ అయితే.. ఆమె చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటీ ? ఆచార్య దాదాపు బయటపడినట్టే. భారతీయుడు 2 సినిమా తిరిగి పట్టాలెక్కనే లేదు. కానీ కింగ్ నాగార్జునకి పెద్ద దెబ్బ పడేలా ఉంది.

ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున-కాజల్ జంటగా ‘ది ఘోస్ట్’ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆసియన్ సునీల్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫట్ మనడంతో ది ఘోస్ట్ విషయంలో కాస్ట్ కటింగ్ కి వెళ్లారు. యాక్షన్ పార్ట్ తగ్గించి, ఫ్యామిలీ టచ్ ఇవ్వడం కోసం రైటర్ అబ్బూరి రవిని రంగంలొకి దింపారు. ఇప్పుడు కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలు ది ఘోస్ట్ చిత్రబృందాన్ని కలవపెడుతున్నాయి. ఇదే నిజమైతే ది ఘోస్ట్ సినిమాకు హీరోయిన్ ను మార్చుకోవాల్సి వస్తుంది. అదో భారం. అసలే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదు.