TTD ప్రత్యేక ఆహ్వానితులు.. దర్శనాల కోసమేనా ?
టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. 25 మందితో పాలక మండలిని ప్రకటించారు. ఇందులో ఏపీతో సహా ఐదు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర) వారికి ప్రాధాన్యత కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో 50 మంది ఉన్నారు. వీరికి స్థానిక కోటాలో ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో మరో ఇద్దరు అదనం.
ఎక్కువ మంది దర్శనాల కోసమే ఈ పదవుల కోసం లాబీయింగ్ చేస్తారు. దర్శన టిక్కెట్లను టిటీటీ సభ్యుల పేరుతో తీసుకుని అనేక మంది బ్లాక్‌లో అమ్ముతూ ఉంటారు. అధికారింగా రోజుకు రెండు వందల టిక్కెట్లు ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దర్శనాల కోసమే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు వరకూ 12 మందితో టీటీడీ పాలక మండలి ఉంది. తర్వాత టీడీపీ హయాంలో ఈ సంఖ్యను 15కు పెంచారు. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు చాన్సిచ్చారు. వైసీపి ప్రభుత్వం పాలక మండలి సంఖ్యను 25కి పెంచుతూ..11 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించింది. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50కి చేశారు.