రాజుకుంద్రా నీలిచిత్రాలు..1,500 పేజీల ఛార్జీషీటు !

పోర్న్ చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నీలిచిత్రాల వ్యాపారంలో రాజ్ కుంద్రా అడ్డంగా సంపాదించాడని పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి నీలిచిత్రాలు తీయడం ద్వారా వేల కోట్ల రూపాయలు గడించారని..  బుధవారం కోర్టులో దాఖలు చేసిన 1,500 పేజీల అనుబంధ ఛార్జిషీటులో పేర్కొన్నారు.

రాజ్‌కుంద్ర, అతని సహచరుడైన రేయాన్‌ థోర్పేలకు వ్యతిరేకంగా ఈ ఛార్జిషీటును క్రైం బ్రాంచ్‌ పోలీసులు మేజిస్ట్రేట్‌ కోర్టులో సమర్పించారు. తాము తీసిన నీలిచిత్రాలను కొన్ని యాప్‌ల ద్వారా నిందితులు మార్కెటింగ్‌ చేసుకునేవారని అందులో తెలిపారు. ఈ కేసులో సింగపూర్‌కు చెందిన యశ్‌ ఠాకుర్, లండన్‌కు చెందిన ప్రదీప్‌ బక్షి కూడా నిందితులుగా ఉన్నారు. గత జులై నెల 19 నుంచి రాజ్ కుంద్రా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.