చిన్నారి చైత్ర అత్యాచార ఘటన.. నిందితుడు ఆత్మహత్య !

సైదాబాద్‌ బాలిక అత్యచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. ఆరేళ్ల చిన్నారి అతి దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన రాజుని పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలని.. ఉరిశిక్ష విధించాలని సామాన్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజుని పట్టుకుంటే రూ. 10 లక్షల రివార్డుని పోలీసులు ప్రకటించారు. హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆఖరిసారి ఉప్పలో రాజుని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి వరకు మఫ్టీలో పోలీసులని ఉంచారు. రాజు ఊహాచిత్రాలని సోషల్ మీడియాలో విడుదల చేశారు. అతడు గుండు గీయించుకుంటే ఎలా ఉంటాడో కూడా చిత్రాలు విడుదల చేశారు. బుధవారం అర్థరాత్రిలోగా నిందితుడిని కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇంతలో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.