అనసూయని జైల్లో పెట్టారు.. ఎందుకంటే ?

హాట్ యాంకర్ అనసూయ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమెని జైల్లో పెట్టారట. అయితే రియల్ న్యూస్ కాదు. రీల్ న్యూస్. బుల్లితెరపై హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది అనసూయ. కానీ వెండితెరపై మాత్రం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అనసూయపై జైళ్లో కొన్ని సీన్లు షూట్ చేశారు. ఈ చిత్రంలో అనసూయ జైల్ సీన్స్ కీలకమని తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ ఏపీలోని గోకవరం ప్రాంతంలో జరుగుతోంది. అక్కడే అనసూయని జైల్లో పెట్టినట్టు సమాచారమ్. ‘రంగస్థలం’ సినిమాలో అనసూయకి రంగమ్మత్త లాంటి మంచి పాత్ర ఇచ్చాడు సుకుమార్. ఇప్పుడు.. పుష్పలోనూ అలాంటి పాత్ర దక్కినట్టు తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ తెరకెక్కుతోంది. బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమా పుష్ప రెండు పార్టులుగా రానుంది. పుష్ప పార్ట్1 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.