డేంజర్ : మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,570 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,42,923 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.96 శాతంగా ఉంది. 
గడిచిన 24 గంటల్లో 413 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,43,928 కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 76,57,17,137 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 64,51,423 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. దేశంలో రికవరీ రేటు అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38, 303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీ అయినవారి సంఖ్య 3,25,60,474గా ఉంది.