‘మాచర్ల నియోజకవర్గం’లో నిధి

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి మంచిరోజులు వచ్చాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది.. ఈ బ్యూటీ. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. శేఖర్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి “మాచర్ల నియోజకవర్గం” అనే టైటిల్ పెట్టారు.

హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇందులో సెకెండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను సెలక్ట్ చేశారు. ఈ హాట్ బ్యూటీ తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా హిందీలో ఓ మ్యూజిక్ వీడియో చేసింది. హిందీలో సినిమాలు చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 కథలు విన్నది. త్వరలోనే వీటిపై ప్రకటనలు చేయనుంది.