బిగ్ బాస్ 5 : బూతులే.. ఉమాదేవి కొంపముంచాయా ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా రెండో వారాన్ని పూర్తి చేసుకుంది. రెండో వారానికి సంబంధించి నటి ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. రెండో వారం ఈ నామినేషన్స్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌ నిలిచారు. చివరికి నటరాజ్‌ మాస్టర్‌, ఉమా దేవి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. ఉమకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

అతి వాగుడే ఉమాదేవి ఎలిమినేషన్ కి కారణమని చెప్పవచ్చు. బండ బూతులు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆగ్రహానికి గురైన ఉమా దేవిని ప్రేక్షకులు బయటికి పంపేశారు. ఆమెను ప్రేమగా పొట్టి అని పిలుచుకునే లోబో ఉమా ఎలిమినేట్‌ అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఈసారి బూతులు, బోల్డ్ ని భరించడం లేదు. తొలివారమే బోల్డ్ బ్యూటీ సరయూని బయటికి పంపించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. రెండో వారం బూతులు మాట్లాడుతున్న ఉమాదేవిని పంపించేశాడు.