Offfical : రానా-వెంకీ వెబ్ సిరీస్

సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి ఓ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వార్తలు గతంలోనే గ్యాసిప్ లుగా వినిపించాయి. ఇప్పుడు వాటినే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది. 

పాపులర్ అమెరికా షో టైమ్ వెబ్ సిరిస్ ‘రేదోనోవన్’ కు అఫీషియల్ అడాప్షన్ గా ఈ వెబ్ సిరీస్ తయారవుతోందని వెల్లడించింది. దీనికి “రానా నాయుడు” అనే పేరు పెట్టారు. దీన్ని లోకోమోటివ్ గ్లోబల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తుంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తారు. మార్చి నాటికి ఈ వెబ్ సిరీస్ రెడీ అవుతుందని తెలుస్తోంది.