రిపబ్లిక్ బాధ్యత పవన్ దే !
దేవకట్టా దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో తేజ్ కలెక్టర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ ట్రైలర్‌ను బుధవారం ఉదయం చిరంజీవి విడుదల చేశారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. అక్టోబర్ 1నే ‘రిపబ్లిక్’ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందన్న సాయి తేజ్ కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతోందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ ని విడుదల చేశారు.
ఇక రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. మరో 4 రోజుల్లో (25వ తేదీన) జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరై సినిమాకు ప్రచారం కల్పించబోతున్నారు. ఆ తర్వాత దర్శకుడు, హీరోయిన్, నిర్మాతలు ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. అక్టోబర్ 1న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. పవన్, చిరంజీవితో పాటు మెగాహీరోలంతా విడుదల రోజు ట్వీట్స్ పెట్టబోతున్నారు. మొత్తానికి రిపబ్లిక్ సినిమానికి ప్రచారాన్ని తీసుకొచ్చే బాధ్యతని మెగా ఫ్యామిలీ భుజాల మీద వేసుకుంది.