‘లవ్ స్టోరీ’ రెండు రకాల క్లైమాక్స్ ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. భారీ అంచనాల మధ్య లవ్ స్టోరీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మొదటి ఓ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల రెండు రకాల క్లైమాక్సులని సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు. ఇందులో ఒకటి విషాదాంతం కాగా, రెండోది సుఖాంతం అనే ప్రచారం జరిగింది. దీనిపై సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు.
లవ్ స్టోరీ కోసం ఒక క్లైమాక్స్ మాత్రమే తెరకెక్కించాం. లాక్డౌన్ సమయానికి షూట్ దాదాపు పూర్తయింది. ఆ తర్వాత 6,7 నెలల సమయం దొరికింది. పతాక సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉండాలని, అదే క్లైమాక్స్‌ని కొన్ని మార్పులతో మళ్లీ తెరకెక్కించారు. ఇంత ఎక్కువ సమయం దొరకడంతో డబ్బింగ్‌పైనా ఎక్కువ దృష్టి పెట్టే వీలుచిక్కింది. తెలంగాణ యాస కోసం పాటలు, వీడియోలు ఎక్కువ చూశానని చైతూ చెప్పుకొచ్చారు.