రివ్యూ : లవ్ స్టోరీ – బ్లాక్ బస్టర్ (3.5/5)
చిత్రం : లవ్ స్టోరీ (2021)
నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి భాయి. ఉత్తేజ్ తదితరులు
సంగీతం : పవన్
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : నారాయణ్ దాస్, రామ్మోహన్ రావు
రేటింగ్ : 3.5/5
శేఖర్ కమ్ముల – దర్శకుడిగా టాలీవుడ్‌పై ప్రత్యేక ముద్రవేశాడు. ఫీల్‌గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ ఇలా ఆయన సినిమాలన్నీ ప్రత్యేకమైన శైలిలో కొనసాగుతాయి. ఈసారి ఆయన కులం, జాతి వివక్షని సృషిస్తూ లవ్ స్టోరీని తెరకెక్కించారు. నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించారు. లవ్ స్టోరీ పాటలు, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. మూడ్రోజుల పాటు టికెట్స్ ముందే బుక్కైపోయాయ్. ఇలాంటి భారీ అంచనాల మధ్య లవ్ స్టోరీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. లవ్ స్టోరీ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
ఆర్మూర్ కి చెందిన రేవంత్ (నాగ చైతన్య) ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ కి వచ్చి.. జుంబా కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. మౌనిక (సాయి పల్లవి) అదే గ్రామమైన ఆర్మూర్‌కు చెందిన ధనవంతురాలు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ కు వస్తుంది. ఉద్యోగం రాకున్నా.. ఆమె ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తుంటుంది. రేవంత్ , మౌనిక ఒకరినొకరు ఎలా కలుసుకున్నారు. ఎలా ప్రేమలో పడ్డారు ? ఆ తర్వాత వారికి ఎదురైన పరిస్థితులు ఏంటీ ? ఫైనల్ గా ఈ జంట ఒక్కటయిందా ? అన్నది మిగితా కథ.
ఎలా ఉంది ?
శేఖర్ కమ్ముల సినిమాల్లో చింపుకోవడాలు, కొట్టుకోవడాలు, కక్షలు.. గట్రా ఉండవు. సింపుల్ గా పాత్రల పరిచయం. వారి నేపథ్యంలో ఇలా వారితో మనల్ని కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత బలమైన ఎమోషన్స్ తో కథని ముందుకు నడిపిస్తాడు. లవ్ స్టోరీని అలానే నడిపించాడు దర్శకుడు. హీరో-హీరోయిన్ల నేపథ్యం.. వారి లక్ష్యాలు అందుకోసం వారు పడే పాట్లు. ప్రేమలో పడటం.. అడ్డంకులు.. ఇలా సాగింది. కుల,జాతి వివక్షత లాంటి సున్నితమైన అంశాలని శేఖర్ కమ్ముల తనదైన స్టయిల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు. అది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఇక రేవంత్ పాత్రలో చైతూ ఒదిగిపోయాడు. ప్రేమకథలు చైతూకి బాగా సూటవుతాయి. కానీ డాన్సులు చేయడంలో వీకే. కానీ లవ్ స్టోరీలో ఆయన్ని జుంబా డాన్సర్ గా చూపించాడు. చైతూ కూడా బాగా డ్యాన్స్ చేశాడు. తెలంగాణ యాసలోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి మరోసారి తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది. ఫిదాలో కనిపించిన సాయి పల్లవి.. లవ్ స్టోరీలో కనిపించిన సాయి పల్లవి టోటల్ డిఫరెంట్. మౌనిక పాత్రకు వందశాతం న్యాయం చేసింది. క్లైమాక్స్ నే సినిమాకు ప్రాణం. దాన్ని చాలా కన్విన్స్ గా చూపించారు దర్శకుడు.
సాంకేతికంగా :
లవ్ స్టోరీ పాటలు ఆల్రెడీ హిట్. నేపథ్య సంగీతంతోనూ పవన్ మాయ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమూ సహజంగా కనిపిస్తుంది. సంభాషణలు బాగున్నాయి. సమాజం గురించి ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. శేఖర్ కమ్ముల క్లాసులోనే సినిమా సాగింది. కానీ క్లైమాక్స్ మాత్రమే డిఫరెంట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కథ-కథనం
- సాయి పల్లవి, చైతూల నటన
- ఎమోషనల్ సీన్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్ :
- స్లో నేరేషన్
రేటింగ్ : 3.5/5
పంచ్ లైన్ : లవ్ స్టోరీ కి ఫిదా అవ్వాల్సిందే