పవన్- షేర్ని నాని ట్విట్టర్ ఫైట్
టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై కడిగేశాడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే పవన్ కు టాలీవుడ్ నుంచి సపోర్టు లభించకపోవడం విడ్డూరం. పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి అంటూ టాలీవుడ్ ఓ ప్రకటన కూడా చేసింది. మరికొందరు వైసీపీ సపోర్టుదారులు మీడియా ముందుకొచ్చి పవన్ ని విమర్శిస్తున్నారు. కానీ పవన్ మాటల్లో నిజాయితీ ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అనే నాధుడు లేకపోయిండు. ఇలాంటి నేపథ్యంలో పవన్ వెనకడుగు వేయలేదు. మరో అడుగు ముందుకేస్తూ.. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
”తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే” అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ”జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు” అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. దీంతో.. పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఫైట్ ట్విట్టర్ కు చేరుకుంది. ఇప్పుడు రాసుకున్నోళ్లకు రాసుకున్నంత.