‘పుష్ప’రాజ్‌ రిలీజ్‌ డేట్‌ చెప్పేశాడు

సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’.  ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు.మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో బన్నీ ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ సినిమాలో ఆమె పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టులుగా పుష్ప తెరకెక్కుతోంది.

తాజాగా పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేటుని చిత్రబృందం ప్రకటించింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవిశ్రీ-సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు. మైత్రిమూవీస్ నిర్మిస్తోంది.