బిగ్ బాస్ హోస్ట్’గా సూపర్ స్టార్ !
బిగ్ బాస్ హోస్ట్ గా సూపర్ స్టార్ వ్యవహరించబోతున్నాడు. ఇందుకు గానూ ఆయన తీసుకోనున్న రెమ్యూనరేషన్ షాక్ కు గురిచేస్తుంది. హిందీలో పాపులరైన బిగ్ బాస్ షో తెలుగు, తమిళ్, మరాఠి బాషల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు బాషల్లో సీజన్ – 1 విజయవంతంగా పూర్తి చేసుకొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్’గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ – 1 సూపర్ హిట్టయ్యింది. రికార్డు టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకొంది. అంతకుమించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకొంది. ఇప్పుడు మలయాళంలో బిగ్ బాస్ షోని తీసుకురానున్నారు.
సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ గా బిగ్ బాస్ మలయాళ సీజన్ – 1ని ప్రసారం కానుంది. ఈ షో కోసం సూపర్ స్టార్ ఏకంగా రూ. 12కోట్లు తీసుకొంటున్నట్టు సమాచారమ్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కోసం తారక్ రూ. 8కోట్ల పారితోషికం తీసుకొన్నాడనే ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇప్పుడు మోహన్ లాల్ తారక్ ని మించిపోయాడు. ఏకంగా రూ. 12కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడు. అన్నట్టు.. తారక్, మోహన్ లు కలిసి ‘జనతా గ్యారేజ్’లో నటించిన సంగతి తెలిసిందే.