మా ఎన్నికలు : దేవుడు చక్రం తిప్పుతున్నాడా ?
మూ వీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పోటీ దారులుగా ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారంలో వేగం పెంచారు. అయితే మా ఎన్నికల వెనక రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి సినిమా కోణం, రెండోది పొలిటికల్ కోణం. సినిమా యాంగిల్ లో చూస్తే.. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మంచి విష్ణుకు కృష్ణ, మోహన్ బాబు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.
రాజకీయంగా చూస్తే.. ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేటీఆర్ కి చాలా దగ్గర మనిషి. ఆయన గెలుపుని గులాబి పార్టీ ఆకాంక్షిస్తుంది. కానీ ఎక్కడ బయటపడటం లేదు. ఇక మంచు విష్ణు విషయానికొస్తే.. ఆయనకు ఏపీ ప్రభుత్వం అండాదండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మా ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రకాష్ రాజ్ గెలుపును డ్యామేజ్ చేసే వ్యక్తులని పవన్ బుజ్జగించడమే ఇందుకు నిదర్శనం.
మా ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న.. నటుడు బండ్ల గణేశ్ ప్రకాష్ రాజ్ గ్రూపులో చేరిపోయారు. నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల తెలిపారు. ఆ దైవ సమానులు ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, కొందరు సినిమావాళ్లు దేవుడిగా కొలిచే పవన్ చక్రం తిప్పడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరీ.. ఆయన వ్యూహాలు ఫలించి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలుస్తాడా ? అన్నది చూడాలి.