వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు

అందమైన గడసరి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు.. ఓ అబ్బాయి పడే కష్టాలను చూపిస్తూ తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావాలెను’. నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్నారు. లక్ష్మి సౌభాగ్య దర్శకురాలు. దసరా కానుకగా అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. గీతామాధురి అండ్‌ కో ఈ పాటను ఎంతో హుషారెత్తించేలా ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.