దిస్ ఈజ్ మై బాస్ పవన్ కళ్యాణ్..!!
మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా తన ట్విట్టర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘దిస్ ఈజ్ మై బాస్ పవన్ కల్యాణ్’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. పవన్ చర్య అద్భుతమంటూ, రెండు చేతులెత్తి మొక్కుతున్నానంటూ ఎమోజీలను ఉంచారు. , రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం జరిగిన సందర్బంగా తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి అన్న అర్థం వచ్చేలా బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.