సమంత ఇంకా ఓపెన్ కావాలి

తమ వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు నాగచైతన్య – సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకుంది.
“ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడక గదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోకూడదు. ఇక పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి” అంటూ ఓస్టోరీని ఇన్‌స్టాలో షేర్ చేసింది. విడాకుల ప్రకటన తర్వాత సామ్ ఇన్‌స్టాలో పంచుకున్న తొలి స్టోరీ ఇది.
ఇంతకీ ఏ విషయంలో సామ్ ప్రపంచాన్ని మార్చాలనుకుంటుంది. చైతూ విడిపోవడానికి అస్సలు కారణాలేంటీ ? అన్నది తెలియాలంటే సామ్ ఇంకా ఓపెన్ కావాల్సి వుంది. భవిష్యత్ తో ఏదో ఓ సందర్భంలో సామ్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు భర్తతో విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ ని వదిలి.. ముంబైకి వెళ్లనుంది. అక్కడే ఉండనుంది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనుందనే ప్రచారం జరుగుతుంది. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిళంలో ‘కాతువాక్కుల రెండు కాదల్’ అనే చిత్రాల్లో నటిస్తోంది.