రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ : బోనస్‌గా 78 రోజుల వేతనం
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల మేర భారం పడనుంది. ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌గా అందనుంది.
దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్ట్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం-మిత్ర) పార్కుల ఏర్పాటుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో రూ.4,445 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను.. 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.