బీటెక్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. భారీగా ఫీజు పెంపు !

 బీటెక్‌ కనీస ఫీజు రూ.75 వేలుగా  జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది. ఆరేళ్ల క్రితం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశాల మేరకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల గరిష్ఠ రుసుం ఆయా నగరాల స్థాయిని బట్టి ఎంత ఉండాలో స్పష్టంచేసిన శ్రీకృష్ణ కమిటీ…తాజాగా కనీస రుసుంలను కూడా నిర్ణయించింది.

ప్రస్తుతం తెలంగాణలో బీటెక్‌ కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ఠం రూ.1.34 లక్షలుగా ఉంది. ఏపీలో గరిష్ఠ రుసుమే రూ.70 వేలు. తెలంగాణలో 158 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వాటిల్లో రూ.35 వేలు రుసుంగా ఉన్న కళాశాలలు 20, రూ.75 వేల లోపున్న కళాశాలలు 100 వరకు ఉన్నాయి. అన్నింటిలో శ్రీకృష్ణ కమిటీ నిర్దేశించిన మేరకు అమలుచేస్తే రుసుంలు భారీగా పెరుగుతాయి.