ఆఖర్లలో పుంజుకుంటే.. ఏం లాభం !
ప్లేఆఫ్స్ రేసులో లేకపోయినా.. పట్టుదల ప్రదర్శించిన సన్‌రైజర్స్ ఆర్‌సీబీకి కళ్లెం వేసింది. ఆ జట్టుని ఓడించింది. మొదట సన్‌రైజర్స్ 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. జేసన్ (44; 38 బంతుల్లో 5×4), విలియమ్సన్ (31; 29 బంతుల్లో 4×4) రాణించారు. హర్షల్ పటేల్ (3/33), క్రిస్టియన్ (2/14) ఆ జట్టును కట్టడి చేశారు.
అనంతరం సన్‌రైజర్స్ బౌలర్లందరూ సమష్టిగా సత్తా చాటి.. బెంగళూరును 137/6కు పరిమితం చేశారు. మ్యాక్స్‌వెల్ (40; 25 బంతుల్లో 3×4, 2×6), పడిక్కల్ (41; 52 బంతుల్లో 4×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. చివరి మ్యాచ్‌లో గెలిచినా రన్‌రేట్‌లో చెన్నైని దాటడం కష్టమే కాబట్టి ఆర్‌సీబీ టాప్-2లోకి వెళ్లడం కష్టమే.