దానం అనుచరులకు జీహెచ్ఎంసీ జరిమానా…!

కాంగ్రెస్ పార్టీని వీడి దానం నాగేంద‌ర్ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరిక సంద‌ర్భంలో హైద‌రాద్ లోని ప‌లు ప్రాంతాల్లో దానం అనుచ‌రులు భారీగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని దానం నివాసం వద్ద నుంచి తెలంగాణ భవన్, బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల ఏర్పాటు పై నిషేధం ఉన్న నేప‌థ్యంలో దానం అనుచ‌రుల‌కు జీహెచ్ఎంసీ జ‌రిమానా విధించింది. దానం అనుచరులు నాగేంద్ర, మోహన్ రెడ్డిలు నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లను ఏర్పాటు చేశారంటూ ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున మొత్తం 30 వేల రూపాయ‌ల‌ను జీహెచ్ఎంసీ జరిమానాగా విధించింది. గతంలో కూడా కేటీఆర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసిన వారిపై జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.