సీక్రెట్ గా తల్లయిన శ్రియా

ప్రేమలో ఉన్న విషయాన్ని దాచిన హీరోయిన్స్ ని చూశాం. సడెన్ అతడితో.. తాను ప్రేమలో ఉన్నా. త్వరలోనే పెళ్లి. ఇన్నాళ్లు సీక్రెట్ గా డేటింగ్ చేశానని చెప్పి సప్రైజ్ చేసిన ముద్దుగుమ్మలు ఉన్నారు. కానీ తల్లికాబోతున్న విషయాన్ని, తల్లయిన తర్వాత ఆ గుడ్ న్యూస్ ని పంచుకోని హీరోయిన్ మాత్రం ఎవ్వరూ లేరు. ఈ జాబితాలోకి తొలిసారి హీరోయిన్ శ్రియా చేరింది. అవును.. శ్రియా తల్లయింది. అది కూడా ఏడాది కిందటే.  బిడ్డ కూడా పుట్టేశాడని.. ఆ బిడ్డకు ఏడాది అయిందని కూడా ఎవరికీ తెలియదు. నిన్ననే ఆమె చెప్పి కొన్ని వీడియోలు బయటపెడితేనే తెలిసింది. శ్రియ కూల్‌గా తాను తల్లయిన విషయాన్ని చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశారు.

మొదటిలాక్ డౌన్‌ సమయంలో భర్తతో కలిసి బార్సిలోనాలో ఉండిపోయిన ఆమె.. అక్కడ బిడ్డను కనేసింది. ఆ సమయంలోనూ ఆమె తరచూవీడియోలు పోస్ట్ చేసేవారు. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసేవారు. అయితే ఎప్పుడూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కానీ బిడ్డ విషయాన్ని కానీ బయట పెట్టలేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఇండియాకు వచ్చినా విషయాన్ని రహస్యంగానే ఉంచారు. ఇప్పుడు తాపీగా తల్లయిన విషయాన్ని వెల్లడించారు శ్రియా. ‘ఆర్ఆర్ఆర్’ శ్రియా నటించింది. అజయ్ దేవగణ్ కి జంటగా కనిపించనుంది.