మరో ‘మా’ అసోసియేషన్ పెట్టబోతున్నారా ?
హోరాహోరీగా జరిగిన ‘మా’ పోరులో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికలు ముగిసినా… ఆ హీటు మాత్రం చల్లారడం లేదు. డబుల్ అయింది.ఎన్నికల తర్వాత ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్, నటుడు నాగబాబు రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ.. ప్రకాశ్ రాజ్ పానల్ మొత్తం రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మా రెండుగా చీలిపోయింది. మరో మా అసోసియేషన్ రాబోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మా ఎన్నికలు, ఆ తర్వాతి పరిణాలపై ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు.. మరో అసోసియేషన్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో ‘మా’ ఎన్నికల్లో అలాంటివి జరిగాయి. తాము గెలిస్తే సభ్యుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం అనే విషయాలను తెలియజేస్తూ సాధారణంగా ఎన్నికల్లో నిలబడతారు. ప్రాంతీయవాదం, కులంతోపాటు ప్రకాశ్‌రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ప్రత్యర్థి ప్యానల్ సభ్యులు కామెంట్ చేసినప్పుడు.. అతనికి సపోర్టర్‌గా నేను వారికి కౌంటర్ ఇచ్చాను.
ఇన్నాళ్లు ఈ అసోసియేషన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. విశాలహృదయంతో వ్యవహరిస్తారనుకున్నాను. కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు.
మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధంలేదు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదు.
పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు, అభిమానులు.. ఇలా ఎవరైనా కష్టమంటూ మా ఇంటికి వస్తే ఆయన తనకు చేతనైనంత సాయం చేశారు. అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదు. ఆయనకు అంత అహంకారం లేదు’ అని నాగబాబు అన్నారు. అనంతరం మరో అసోసియేషన్ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదన్నారు.