హుజూరాబాద్‌లో గులాబీ జెండాయే

సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు. మరోసారి ముందుస్తుకు వెళ్లనున్నారు అనే ప్రచారానికి కేసీఆర్ పులిస్టాప్ పెట్టారు. ఈసారి ముందస్తు వెళ్లడం లేదని ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో పాటు పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై కూడా కేసీఆర్ స్పందించారు.

హుజూరాబాద్‌లో పాగా వేస్తాం. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భాజపాపై 12.5 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది. 26 లేదా 27న ప్రచారానికి రావాలని స్థానిక నేతలు కోరారు. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.