బ్యాచిలర్ కు అదృష్టం పట్టేసింది
బుట్టబొమ్మ పూజా చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. అందుకే తను అదృష్ట కథానాయిక అయిపోయింది. ఆ అదృష్టం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
కీ పట్టేసింది. అఖిల్ చేసిన మూడు (అఖిల్, హలో, మిస్టర్ మజ్ను) సినిమాలు ప్లాపే. దీంతో ఆశలన్నీ తన నాల్గో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
పైనే పెట్టుకున్నాడు. దసరా సందర్భంగా విడుదలైన ఈసినిమాకి ఓ మోస్తరు రేటింగులు వచ్చాయి. కాకపోతే.. వసూళ్లు మాత్రం జోరుగానే ఉన్నాయి.
దసరా సందర్భంగా విడుదలైన మూడు సినిమాల్లో.. బ్యాచిలర్ నే బెటర్. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇదంతా పూజా హెగ్డే చలవే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. ఈ సినిమాకి యువతరం ప్రేక్షకులే మహారాజ పోషకులు. వాళ్లంతా పూజా కోసమే థియేటర్లకు వెళ్తున్నారని టాక్. దాంతో పాటుగా పూజా క్యారెక్టర్ కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. వరుస ప్లాపుల్లో ఉన్న అఖిని పూజా గట్టేక్కించేసింది. హిట్ కిక్కుని ఇచ్చింది.