జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. కొత్త అప్ డేటు !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారనే ప్రచారం చాన్నాళ్ల నుంచి జరుగుతుంది. స్వయంగా కేసీఆర్ నే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఎన్నికలు ముగిసినాక ఢిల్లీకి వెళతా.. గత్తర లేపుతా అంటూ కేసీఆర్ ప్రకటనలు చేస్తారు. ఆ తర్వాత షరా మాములు. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్లడం ఖాయమైందని సీరియస్ ప్రచారం మొదలైంది.
అంతేకాదు.. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరనుంది. కేసీఆర్ ఉపరాష్టతి కానున్నారనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్.. సమయం, సందర్భాన్ని బట్టి తెరాస కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని అన్నారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సప్ యూనివర్సిటీ ప్రచారమే తప్ప నిజం లేదని చెప్పారు.