ఈటల మాకో లెక్కా
హుజురాబాద్ ఉప ఎన్నికల చాలా చిన్నది అంటూ మంత్రి కేటీఆర్ లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రచారంలో కూడా పాల్గొననని క్లారిటీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో సీనియర్ కాంగ్రెస్‌నేత జానారెడ్డిని ఓడించాం… ఈటల రాజేందర్ అంతకన్నా గొప్ప నేతేం కాదు. హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుందన్నారు కేటీఆర్. రేవంత్, ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు. కావాలనే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపింది.ఈటలకు ఓటెయ్యాలని ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ లేఖ రాయడం కుమ్మక్కులో భాగమే.
టీపీసీసీ అధ్యక్షునిగా తొలి ఉపఎన్నిక కోసం హుజూరాబాద్‌కు వెళ్లకుండా రేవంత్ చిలకజోస్యం చెబుతున్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ ఆ పని చేయలేదు. దమ్ముంటే ఇప్పుడైనా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ తెచ్చుకోవాలి. ఈటల బలవంతంగా భాజపా బురదను అంటించుకున్నారు. ఆ పార్టీని మాత్రం సొంతం చేసుకోవడం లేదు. ఓడిపోతామనే భయంతో జైశ్రీరామ్ అనడం లేదు. తెరాస ఎంతో చేసినా పార్టీకి ఎందుకు రాజీనామా ఇచ్చారో రాజేందర్ చెప్పడంలేదు. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఈటల, వివేక్, ఇతర నేతలు గంపగుత్తగా కాంగ్రెస్‌లో చేరతారని కేటీఆర్ అన్నారు.