ఎన్టీఆర్ చేతుల్లో టీడీపీ.. చంద్రబాబు నిర్ణయం !
తెలుగుదేశం పార్టీది ఘన చరిత్ర. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనుడు ఎన్టీఆర్. ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. పేదోడి ఆకలి తీర్చాడు. తెలుగోడు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశాడు. అయితే తెలుగుదేశం పార్టీ ఒకప్పటి వైభవం ఇప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఒక్క ఏపీకే తెదేపా పరిమితం అయింది. ప్రత్యేక ఆంధ్రప్రదేష్ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. జగన్ నేతృత్వంలోని వైకాపా ఘనవిజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన జగన్.. ఇచ్చిన, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెదేపాకు భవిష్యత్ కనిపించడం లేదు.
మరోవైపు చంద్రబాబు తర్వాత తెదేపా వారసుడిగా నారా లోకేష్ పై ప్రజల్లో కాదు.. పార్టీ నేతల్లోనూ నమ్మకం లేదు. దీంతో ఒక్క జూ. ఎన్టీఆర్ వలనే తెదేపా బతికి బట్టకట్టే అవకాశాలు ఉన్నాయని తెదేపా శ్రేణులు అంటున్నాయి. ఇన్నాళ్లు వాటిని విని విననట్టు ఉన్నారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఆయనకు జ్ఝానోదయం అయింది. ఇంకా ఆలస్యం చేస్తే.. పార్టీని మూసుకోవాల్సింది. తనయుడు లోకేష్ కోసం ఆలోచిస్తే.. అసలు పార్టీనే చరిత్రలో కలిసిపోయేలా ఉందని భావించినట్టు ఉన్నారు. అలా పార్టీ కనుమరుగు అయ్యే కన్నా.. జూ. ఎన్ టీఆర్ చేతుల్లో పార్టీ పెడితేనే మంచిందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే ఇటీవలే చంద్రబాబు నుంచి తారక్ కి కబురు వెళ్లింది. త్వరలో వీరిద్దరు సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ పై ఓ నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. పార్టీని తారక్ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు సిద్ధం. కానీ దాన్ని స్వీకరించడానికి తారక్ రెడీనా ? అన్నది తెలియాల్సి ఉంది.