మళ్లీ కరోనా కల్లోలం
ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్ మరోసారి విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి.
డెల్టా ఉత్పరివర్తనంలోని ఏవై 4.2 రకం ఇక్కడ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. భారత్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. విదేశాల్లో కరోనా విజృంభణతో మనదేశంలో కరోనా కోరలు చాపే ప్రమాదం ఉంది. అది థర్డ్ వేవ్ కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలి. కరోనా నిబంధనలని పాటించాలని సూచిస్తున్నారు.