టీమిండియాలో ఆ ఇద్దరు డేంజర్
ప్రపంచకప్ మ్యాచుల రికార్డుల్లో పాక్‌పై టీమిండియాదే హవా. మరి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ విశ్లేషణలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ స్పందించాడు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చాలా డేంజర్ అని హెడెన్ అభిప్రాయపడ్డారు. వారితో పాక్‌కు ముప్పు ఉండబోతోందని అంచనా వేశాడు. కేఎల్ రాహుల్ పొట్టి క్రికెట్లో తొలినాళ్లలో బౌలర్లను శాసించడం గమనించా. కాబట్టే కేఎల్ రాహుల్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే విధ్వంసం సృష్టించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే రిషభ్ పంత్‌తో కూడా అప్రమత్తంగా ఉండాలని హెడెన్ సూచించారు.